అస‌లు మ‌నం మ‌నుషుల‌మేనా?

244
Gang Rape on two sisters in Gandhi Hospital
Gang Rape on two sisters in Gandhi Hospital


ఎక్క‌డో విదేశాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై స్పందిస్తాం.. అందరినీ నిల‌దీస్తాం.. డౌన్ డౌన్ అంటాం.. ఇక సోష‌ల్ మీడియాలో అయితే.. టెక్నాల‌జీ చ‌దివిన‌వారైతే.. వాళ్ల గొంతు న‌రాలు తెగేదాకా మెస్సేజ్‌లు పెడుతుంటారు.. టాం టాం చేస్తారు. కానీ మ‌న కండ్ల ముందు.. మ‌న కాళ్ల ద‌గ్గ‌ర జ‌రిగిన సంఘ‌ట‌న‌ను క‌నీసం ఎవ‌రూ ప్ర‌శ్నించిన పాపాన పోవ‌డం లేదు. అస‌లు మ‌నం మ‌నుషుల మేనా అనే అనుమానం వ‌స్తుంది అందుకే.

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు భ‌ద్రంగానే ఉన్నాయా అనే అనుమానం వ‌స్తోంది. కేవ‌లం హుజూరాబాద్ ఎన్నిక‌ల కోసం అయితే ఏమైనా చేస్తామ‌నే రీతిలో ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్ర‌భుత్వం. మా ప‌రిపాల‌న‌లో ఎక్క‌డా అన్యాయం జ‌ర‌గ‌నివ్వం అంటారుగా.. ఇప్పుడు గాంధీ ఆసుప‌త్రిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ఎందుకు పెద‌వి విప్ప‌డం లేదు. రాష్ట్ర ప్ర‌జ‌లు నా బిడ్డ‌లు అంటారుగా. మ‌రి మీ ఇంట్లోని బిడ్డ‌ల‌పై జ‌రిగిన అఘాయిత్యంపై ఇలాగే మౌనంగా ఉంటారా? మీ ప‌రిపాల‌న‌లో ఇంత‌టి దారుణం జ‌రిగినా.. మీ దృష్టి మొత్తం హుజూరాబాద్‌పైనే ఉంటాయా.. అయితే మేము దృత‌రాష్ట్రుడి పాల‌న‌లో ఉన్నామా.. మీరు అస‌లు మ‌నుషులేనా?

  • మ‌న దేశంలోనే కాదు.. వేరే దేశాల్లో చీమ చిటుక్కుమ‌న్నా గొంతు చించుకునే సామాజిక మాధ్య‌మాల‌న్నీ ఎందుకు గొంతు పెగ‌ల్చ‌డం లేదు. గాంధీ ఆసుప‌త్రిలో అక్కాచెల్లెల్ల‌పై వారం రోజులుగా గ్యాంగ్ రేప్ జ‌రిగినా.. ఒక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ నిర‌స‌న తెల‌ప‌డం లేదు. ఎందుకని.. ఒహో కేవ‌లం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగ‌ళూరు లాంటి సాఫ్ట్‌వేర్ కేంద్రాల్లో జ‌రిగితేనే స్పందిస్తారా.. నిల‌దీస్తారా.. నిర‌స‌న తెలుపుతారా?.. వ‌ల‌స‌ల జిల్లాకు చెందిన అమాయ‌క గ్రామీణ మ‌హిళ‌లు అయితే మాకేం అంటూ ప‌ట్ట‌న‌ట్టు ఉంటారా? వారు మ‌హిళ‌ల కింద‌కు రారా.. వాళ్ల‌కు జ‌రిగింది అన్యాయం కాదంటారా? అస‌లు మ‌నం మ‌నుషుల‌మేనా?
  • అంద‌రూ అఫ్ఘ‌నిస్తాన్‌లో ఏం జ‌రుగుతుంది అని చూస్తున్నారా.. అక్క‌డి మ‌హిళ‌ల ప‌రిస్థితి ఏమిట‌ని బాధ‌ప‌డుతున్నారా? మ‌న మ‌న ద‌గ్గ‌ర జ‌రుగుతున్న సంఘ‌టన ప‌ట్టించుకోరా.. ఇక్క‌డి మ‌హిళ‌ల ఆక్రంద‌న‌లు విన్పించ‌వా? ఒక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో వారం రోజులుగా ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై అమానుషంగా.. గ్యాంగ్ రేప్ జ‌రిగినా క‌నీసం ఒక్క ప‌త్రిక కూడా దానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదంటే మ‌నం కాలంలో ఉన్నాం? ఎంత‌టి నికృష్ట పాల‌న‌లో ఉన్నాం. మ‌రి అలాంటి మ‌న‌కు ఆఫ్ఘానిస్తాన్ మ‌హిళ‌ల గురించి ఆలోచించే, సానుభూతి చూపించే, ఆవేద‌న వెళ్ల‌గ‌క్కే హక్కు ఉందంటారా? అక్క‌డి తాలిబాన్‌లు ఏం చేస్తారో అని ఆందోళ‌న ప‌డిపోతున్నామే.. ఇక్క‌డి తాలిబాన్‌ల ప‌రిపాల‌న గురించి ప‌ట్టించుకోరా? అక్క‌డికి ఇక్క‌డికి తేడా ఏమీ లేదు. అక్క‌డ క‌నీసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రులో్ ఇలా చేయ‌క‌పోవ‌చ్చు. కానీ ఇక్క‌డ గాంధీ పేరుతో ఉన్న ప్ర‌భుత్వ ఆస‌ప‌త్రిలోనే ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప‌ట్ల క‌నీసం స్పందించ‌క‌పోవ‌డం… అస‌లు మ‌నం మ‌నుషుల‌మేనా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here