గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన గంగవ్వ

32
Gangavva in Green india challenge
Gangavva in Green india challenge

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆకర్షించి కొత్త పుంతలు తొక్కుతు ముందుకు కొనసాగుతుంది. తాజాగా మై విలేజ్ షో, బిగ్ బాస్ సీజన్-4లో కనిపించిన గంగవ్వ ఈ చాలెంజ్ ను స్వీకరించారు. సోమవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లిలోని పకృతి వనంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తాను ఆ ఛాలెంజ్ స్వీకరించి మొక్క నాటినట్టు తెలిపారు. మొక్కలను నాటడంతో వాతావరణం లో సమతుల్యత ఏర్పడుతుందన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.

ts news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here