Sunday, September 29, 2024

“గ్యాంగ్ స్టర్” మూవీ రిలీజ్ పోస్టర్

చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా అక్టోబర్ 25 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ పోస్టర్ ని సాయి మాధవ్ బుర్ర గారు విడుదల చేశారు.

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ..సినిమా లో టీజర్ మరియు ట్రైలర్ ఇంకా పోస్టర్స్ అధ్బుతంగా ఉన్నాయి …ఈ సినిమా కి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని విజయం వరించాలని కోరుకుంటున్నాను అన్నారు .

నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ – రెండు గ్యాంగ్స్ మధ్య వార్ ను మా డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ప్రతి సీన్ రిచ్ గా ఉంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. గ్యాంగ్ స్టర్ మా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. అన్నారు.

హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ – సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను.దిల్ రాజు గారు ట్రైలర్ చూసి బాగుందన్నారు. మా సినిమా తేదీ ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన మా సాయి మాధవ్ బుర్రా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular