జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తానన్న గంటా

222
GANTA WELCOMES JAGAN DECISION
Ganta Welcoming The Jagan Decision
GANTA WELCOMES JAGAN DECISION

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తూ రాజధాని రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తుంది. కానీ విశాఖను రాజధాని చేయాలనే ప్రతిపాదనను టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించడం చర్చనీయాంశమైంది. పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా గంటా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు టీడీపీలో ఆయన కొనసాగుతారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నానని గంటా చెప్పారు. తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారని… సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. అమరావతి రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పారు. అమరావతి రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అమరావతికి మద్దతివ్వాలనే పార్టీ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు.పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలను మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. అయితే రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలనిఅదేవిధంగా విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు.

tags : TDP, Ganta Srinivasarao, Vishakhapatnam, Executive Capital, Jagan, Chandrababu, New Year

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here