తిరుమలలో వైభవంగా గరుడవాహన సేవ

285
Garudavahana seva in Thirumala
Garudavahana seva in Thirumala

తిరుమల శ్రీనివాసుడికి శుక్రవారం రాత్రి గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్పస్వామి వారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ వాహనసేవ జరిగింది. శ్రీవారి వాహనాల్లో, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడుడు. ఏటా తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. గరుడ వాహనసేవలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు. స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here