పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

114
Gates of several projects Lifted
Gates of several projects Lifted

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో 54590 క్యూసెక్కులు, ఇన్ ఫ్లో 62312 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 19.6475 టీఎంసీలుగా కొనసాగుతోంది. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు చేరడంతో అధికారులు 5 గేట్లు ఎత్తివేసి 45,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 38,500 క్యూసెక్కులు.. పూర్తి స్థాయి నీటిమట్టం 358.7 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 358.4 అడుగులుంది. నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ తొమ్మిది వరద గేట్లు ఎత్తివేత ఒక లక్ష కూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here