క్లారిటీ ఇచ్చిన ఘట్టమనేని

Ghattamaneni Gave Clarity – ఆ పార్టీలో చేరుతున్నా …

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తానూ ఏ పార్టీ లో చేరబోతున్నారో చెప్పారు. నిన్నటి వరకు తానూ ఏ పార్టీ లో చేరాలో సోదరుడు కృష్ణతో , అభిమాన సంఘాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఆయన ఫైనల్ గా టీడీపీలో చేరతానని చెప్పారు . ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని ఆదిశేషగిరిరావు ప్రకటించారు. ఏపీలో మరోసారి చంద్రబాబే రావాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు పాలన బాగుందని కితాబిచ్చారు. చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ప్రశంసించారు.
2019, జనవరి 3వ తేదీ ఆదివారం గుంటూరులోని ఘట్టమనేని ఆదిశేషగిరిరావు…ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య , ఎమ్మెల్యేలు అలపాటి రాజా, గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు…బుర్రిపాలెంలోని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లారు. టీడీపీలో చేరాలని ఆదిశేషగిరిరావును ఆహ్వానించారు. దీనికి ఆయన సమ్మతం తెలిపారు. ఆదిశేషగిరిరావు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పలు మార్లు సమావేశమయ్యారు. ఇప్పుడు టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు.ఆయన చేరికతో పార్టీలో కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు . మహేష్ ఫ్యాన్స్ అండ కూడా దొరుకుతుంది అని భావిస్తున్నారు. ఒక పక్క కృష్ణ అల్లుడు గల్లా జయరాం కుటుంబం కూడా టీడీపీలోనే వుంది. ఇక తాజాగా కృష్ణతో కూడా సమాలోచనలు జరుపుతున్న టీడీపీ కి సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మద్దతు ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈనేపధ్యంలోనే కృష్ణ సోదరుడు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article