గ‌ట్టు రామ‌చంద్రారావు రాజీనామా

గట్టు రామచంద్రరావు తెరాస పార్టీ కి రాజీనామా చేశారు. గురువారం ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌కు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ అభిమానం పొందడంలో తాను విఫలమయ్యానని.. ఈ నేప‌థ్యంలో పార్టీ లో కొనసాగడం కరెక్ట్ కాదు అని భావిస్తున్నాన‌ని తెలిపారు. అందుకే తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని చెప్పారు. ఇప్పటివరకు త‌న‌ను గౌరవించిన పార్టీ సభ్యులకు, పార్టీ నాయకత్వానికి ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలియచేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article