Gayathri Raghuram Fire on Actress Kushboo
అధికారపక్షం బీజేపీ ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా నిజ్వాలలు కొనసాగుతున్నాయి. పలు మెట్రో ప్రాంతాల్లో ఆందోళన కలిగించే విధంగా ఆందోళనలు చేస్తున్నారు నిరసనకారులు. ఇక ఇదే విషయంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్లమెంట్ లో నిరసనల మధ్య సమావేశాలు వేడెక్కుతున్నాయి. అయితే తాజాగా ఈ అంశం సినిమాకు సంబందించిన ప్రముఖుల మధ్య కూడా మాటల యుద్ధనికి సై అంటుంది. నటి, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుష్బూపై బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీరఘురామ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ కుష్బూ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. బీజేపీ నేత హెచ్.రాజాపై మాటల యుద్ధం చేసింది. దీంతో కుష్బూ ట్వీట్‌పై గాయత్రీరఘురామ్ స్పందిస్తూ ట్విటర్లో ఎదురుదాడి చేసింది.నువ్వు ఎప్పుడైనా నిజాలు మాట్లాడావా? అన్నీ అబద్దాలే అని విమర్శించించారు. నీలాంటి అసత్యవాదులకు,కాంగ్రెస్ నాయకులకు విమర్శించే హక్కులేదని గాయత్రీ రఘురామ్ మండిపడింది. ఇలా ఆరోపణలు, ప్రతిఆరోపణలు చేసుకుంటున్నారు.