గేలకు ఆర్మీలో స్థానం లేదని ఇండియన్ ఆర్మీ

GAYS were Rejected in INDIAN Army

గే లకు ఆర్మీలో స్థానం లేదని ఇండియన్ ఆర్మీ చీఫ్ షాకింగ్ కామెంట్

స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆర్మీ లో చేరడానికి మాత్రం స్వలింగ సంపర్కులకు అవకాశం లేదని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్మీ చీఫ్.
స్వలింగ సంపర్కులపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి . భారత ఆర్మీలో ‘ గే’ లను అంటే స్వలింగ సంపర్కులు)లను అనుమతించలేమని ఆయన తెలిపారు. భారత సైనిక దళం సాంప్రదాయకమైందని.. అందులోకి స్వలింగ సంపర్కలను అనుమతించమని ఆయన అన్నారు.
ఇటీవల సుప్రీం కోర్టు గే సెక్స్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. సుప్రీం ధర్మాసనం అంగీకరించినా మీకేం అభ్యంతరం అని ప్రస్త్నిస్తే అందుకు బిపిన్ రావత్ అయినా సరే తమకంటూ కొన్ని రూల్స్ వున్నాయని ఆర్మీ కి రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రత ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. భారత సైన్యంలోకి వ్యభిచారులను, స్వలింగ సంపర్కులను అనుమతించడం సాధ్యం కాదన్నారు. స్వలింగ సంపర్కం లాంటివి ఆర్మీలో కుదరవన్నారు. అది సైన్యం చట్టాలకు అతీతం కాదని, అయినా భారత రాజ్యాంగం సైన్యానికి కొంత స్వాతంత్య్రాన్ని ఇచ్చిందని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article