ఆర్బీఐ రెండో ఉద్దీపనలో ఏముంది?

GDP Growth by 1.9%

కోవిడ్ ఉత్పాతం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ రెండోసారి పలు కీలక నిర్ణయాల్ని వెల్లడించారు. శుక్రవారం ఆర్థిక పరిస్థితుల గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే జిడిపిలో 1.9% సానుకూల వృద్ధి నమోదు అవుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ అంచనా వేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఖరీఫ్ పంట ఉత్పత్తి 33% పెరిగిందన్నారు. 2021-22లో IMF 7.4% వృద్ధి రేటును అంచనా వేసిందని వెల్లడించారు. ఏప్రిల్ 10 నాటికి భారతదేశం యొక్క విదీశీ నిల్వ 476 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. మార్చి నుంచి ఏప్రిల్ 12 వరకూ సుమారు 1.4 లక్షల కోట్ల రూపాయలను ఉంచామన్నారు. ఏటీఎంలలో సొమ్ము నిల్వల్లేని పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఈ చర్యల్ని తీసుకున్నామని తెలిపారు. తాజా TLTRO-2.0- ప్రారంభించడానికి 50K Cr కోసం. కనిష్ట 50% ప్రవాహం చిన్న NBFC మరియు FII కి వెళ్లాలన్నారు.

* నాబార్డ్, సిడ్బి, ఎన్ హెచ్ బీలకు రీఫైనాన్స్ సౌకర్యాన్ని అందజేస్తామని అన్నారు. దీని వల్ల 25 వేల కోట్లు నాబార్డుకు, సిడ్బీకి పదిహేను వేల కోట్లు, నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు పది వేల కోట్లు లభిస్తాయన్నారు. ఈ రుణాలపై వడ్డీ రేటు 4.4 శాతం ఉంటుందన్నారు. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ వల్ల రివర్స్ రెపో రేటు 0.25% తగ్గిందని తెలిపారు. ఎన్‌పిఎ వర్గీకరణ కాలానికి 01-03-2020 నుండి 31-05-2020 వరకు మినహాయిస్తామన్నారు. ఇంతవరకూ దివాలా తీర్మానం చేయని రుణాలపై అదనంగా 20 శాతం అందజేస్తున్నామని అన్నారు. ఎన్‌బిఎఫ్‌సి మరియు బ్యాంకులు తదుపరి ఆర్డర్ వచ్చేవరకు 31-03-2020 వరకు డివిడెండ్ ప్రకటించకూడదని అన్నారు. ఎల్ సీ ఆర్ ను వంద శాతం నుంచి ఎనభై శాతానికి తగ్గించామన్నారు. ఎన్‌బిఎఫ్‌సి లోన్- 1 సంవత్సరాల పొడిగింపు ఆలస్యాన్ని కమర్షియల్ రియల్‌ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతిస్తామన్నారు. రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి తదనుగుణంగా బ్యాంకులకు అనుమతిస్తామని తెలిపారు.

* ఆర్భీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల భారతదేశంలోని రియల్ రంగానికి ఉపయోగకరంగా మారుతుందని అందుకే తాము రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని క్రెడాయ్ జాతీయ ఛైర్మన్ జక్సేషా అభిప్రాయపడ్డారు. వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్బీఎఫ్సీ రుణాలు ఏడాది పొడిగింపు వంటివి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిర్మాణ రంగానికి ప్రత్యేక ప్యాకేజీని అతిత్వరలో వెల్లడిస్తారనే ఆశాభావాన్ని జక్సే షా వ్యక్తం చేశారు.

rbi governor press meet

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article