పంచ్ హోల్ డిస్ ప్లేతో గెలాక్సీ ఏ9 ప్రో(2019)

GELAXY A9 PRO

  • కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన శాంసంగ్

ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్.. మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. పంచ్ హోల్ డిస్ ప్లే, ట్రిపుల్ లెన్స్ రియర్ కెమెరాతో రూపొందించిన ఈ ఫోన్ ను గెలాక్సీ ఏ9 ప్రో(2019) పేరుతో మార్కట్లోకి లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్ పై పనిచేసే ఈ ఫోన్.. 6.4 అంగుళాల ‘ఇన్ఫినిటీ ఓ’ డిస్ ప్లే కలిగి ఉంది. అంటే.. సెల్ఫీ కెమెరా స్క్రీన్ లో నుంచి బయటకు ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 28 నుంచి దక్షిణ కొరియా మార్కెట్లో  అందుబాటులోకి రానుంది. అయితే, ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై కంపెనీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

గెలాక్సీ ఎ9 ప్రొ (2019) ఫీచ‌ర్లివే…
6.4 అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
6 జీబీ ర్యామ్, ‌128 జీబీ స్టోరేజ్‌
512 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్‌
24+10+5 ఎంపీ ట్రిపుల్ రియర్‌ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article