ఈటెలను గెల్లు ఢీ కొట్ట‌గ‌ల‌డా?

277
Gellu Srinivas Yadav vs Etela Rajender
Gellu Srinivas Yadav vs Etela Rajender

హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ఈటెలతో క‌లిసి ప‌ని చేసిన వ్య‌క్తి వైపు టీఆర్ఎస్ మొగ్గు చూపింది. విద్యార్థి విభాగం నాయ‌కుడిగా ఆరంభం నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌, ఇత‌ర మంత్రుల‌తో క‌లిసి ప‌ని చేసిన గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ కు టికెట్ ఖరారు చేశారు. విద్యార్థి విభాగం నుంచి చురుకైన పాత్ర పోషించిన ఆయ‌న కేసీఆర్‌, కేటీఆర్‌ల అడుగుజాడ‌ల్లో న‌డిచిన వ్య‌క్తి. అధిష్ఠానం ఏం చెబితే అది వినడం వ‌ల్లే ఆయ‌న‌కీ అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. కాక‌పోతే, ఈటెల రాజేంద‌ర్ వంటి వ్య‌క్తిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌డా? అనే సందేహం క‌లుగుతోంది. ఆర్థిక‌ప‌రంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత మ‌ద్దతు ల‌భించినా ఆయ‌న ఛ‌రిష్మాను త‌ట్టుకోగ‌ల‌డా? ఆయ‌న అనుభ‌వానికి, యువ‌రక్తానికి మ‌ధ్య జరిగే పోటీగా అభివ‌ర్ణించ‌వ‌చ్చా? ఎందుకంటే, గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ 2009 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నాయకత్వం లో క్రియాశీలకంగా పనిచేశారు. పైగా, 2010 హుజురాబాద్ ఉప ఎన్నిక లో స్టూడెంట్ ఇంచార్జి గా బస్సు యాత్ర (ప్రజా చైతన్య యాత్ర)లో పనిచేశారు. ఈ అనుభ‌వమూ ఆయ‌న గెలిచేందుకు తోడ్ప‌డుతుంద‌ని టీఆర్ఎస్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here