George Reddy Biopic
ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్‌గా ఉండి, కాలేజీ గొడవల్లో హత్య చేయబడ్డ జార్జ్ రెడ్డి జీవితకథను ఆధారంగా చేసుకుని జార్జ్ రెడ్డి అనే బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. 1962-72 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి పాత్రలో వంగవీటి ఫేమ్ సాండీ నటించబోతున్నారు. దళం సినిమాను తెరకెక్కించిన జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పిరెడ్డి, దాము కోసనం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.