ఒక్కటి కానున్న సికింద్రాబాద్ అబ్బాయి- జర్మనీ అమ్మాయి

German Women Marry With Secunderabad Men

త్వరలో తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షులు స్వర్ణాకర్- జర్మనీ యువతి డాక్టర్ జూలియాల ప్రేమ వివాహం

• జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన‌ స్వర్ణాకర్- జూలియా

• స్వర్ణాకర్-జూలియాలను అభినందించిన మాజీ ఎంపీ కవిత

ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపితమైంది. ఖండాంతరాలు, దేశాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. దీన్ని మరోసారి నిరూపించారు తెలంగాణ యువకుడు, జర్ననీ అమ్మాయి. తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షులు స్వర్ణాకర్, జర్ననీ అమ్మాయి జూలియా మూడు ముళ్ల బంధంతో త్వరలో ఏడడుగులు వేయనున్నారు. స్వర్ణాకర్, జూలియా హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

సికింద్రాబాద్ కు చెందిన స్వర్ణాకర్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం జర్ననీ దేశానికి వెళ్ళాడు. స్వర్ణాకర్ ఉద్యోగం చేస్తూనే, తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షుడైన స్వర్ణాకర్, జర్మనీలో ఉన్న తెలంగాణ వాసులతో బతుకమ్మ, బోనాలతో పాటు, తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు.

స్వర్ణాకర్, జర్ననీలో తనతో పనిచేస్తున్న, అదే దేశానికి చెందిన అమ్మాయి జూలియాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు వారి ప్రేమను ఇరువైపులా తల్లిదండ్రులు అంగీకరించి, స్వర్ణాకర్-జూలియాల పెళ్లికి నిశ్చయించారు. ఈ నెల 22 న బేగంపేటలో భారతీయ సాంప్రదాయం ప్రకారం జూలియా – స్వర్ణాకర్ ల వివాహం జరగనుంది. ఈ సందర్భంగా జూలియా – స్వర్ణాకర్ లను మాజీ ఎంపీ కవిత అభినందించారు.

German Women Marry With Secunderabad Men,German Women Meets EX MP Kavitha,German Doctor Juliyala,Swarnakar Weeds Juliyala,Swarnakar Meets EX MP Kavitha,Ex-MP Kavitha

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article