15.31 లక్షల ఇళ్లలో ఫివర్ సర్వే పూర్తి

79


కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన 1653 బృందాలు నేడు, గురువారం, 176392 ఇళ్లలో సర్వేను చేపట్టాయి. ఇప్పటివరకు మొత్తం 1531507 ఇళ్లలో ఫీవర్ సర్వేపూర్తిచేశారు. ఒక ఏ.ఎం.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం ఉన్నవారి వివరాలను సేకరించి, జ్వరం ఉన్న వారికి ఉచిత మెడికల్ కిట్ లను అందచేశారు. జ్వర కేసులు నమోదయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటి లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.

  • నగరంలో ప్రతీ బస్తి దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాలలో అవుట్ పేషంట్ కు జ్వర పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు, గురు వారం, అన్ని ఆసుపత్రుల్లో 17,150 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 2,68 ,674 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ కు కరోనా సంబంధిత. సలహాలు, సూచనలకు వచ్చిన ఫోన్ కాల్స్ కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here