జీహెచ్ఎంసీలో సింథటిక్ వేలిముద్రల కుంభకోణం

Synthetic Finger Print scanner Problems IN GHMC

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు విధులు నిర్వర్తించిన సిబ్బంది కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ లను సైతం బురిడీ కొట్టిస్తున్నారు కొందరు సిబ్బంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో సింథటిక్ వేలిముద్రలు కుంభకోణం జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టింది. వేలిముద్రలు తయారుచేసి విధులలో లేని వారి హాజరు వేస్తూ అధికారులు సైతం అవాక్కయ్యేలా అక్రమాలకు తెర లేపిన ఉదంతం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది.
జీహెచ్ఎంసీలో మరో కుంభకోణం వెలుగు చూసింది. బయోమెట్రిక్ టెక్నాలజీని సైతం తమకు అనుకూలంగా మార్చుకున్నారు బల్దియా శానిటేషన్ సిబ్బంది. సింథటిక్ వేలి ముద్రలు తయారు చేసిన సూపర్ వైజర్లు కార్మికులు విధుల్లో లేకున్నా హాజరువేసి వేతనాలు కొల్లగొడుతున్నారు. ప్రతి నెలా 8కోట్ల వరకు లూటీ అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు నిలయంగా మారింది. గ్రేటర్ పరిధిలో పనిచేసే 20వేల మంది శానిటేషన్ సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. దీంతో ఖర్చు ఏకంగా 4కోట్లకు తగ్గిపోయింది. అయితే మళ్లీ అక్రమాలకు తెరలేపారు సూపర్ వైజర్లు. వేలిముద్రలు తయారుచేసి విధుల్లో లేని వారి హాజరు వేయడం ప్రారంభించారు. బల్దియా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి అక్రమాలకు పాల్పడుతున్న 9మంది ఎస్.ఎఫ్. ఏలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 84 ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5వేల మంది సిబ్బంది ఫీల్డ్ లో ఉండటం లేదని గుర్తించారు అధికారులు. ఒక్కో వర్కర్ కు నెలకు జీహెచ్ఎంసీ 16,500 ఖర్చు చేస్తోంది. వారిపై పూర్తి విచారణ జరిపి కమిషనర్ కు నివేదిస్తామంటున్నారు విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్‌ కంపాటి. ఈ కుంభకోణంలో సూపర్ వైజర్లే ఉన్నారా అధికారుల హస్తం ఉందా అనేది తేలాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article