వికారాబాద్‌ భూవివాదంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్

వికారాబాద్ జిల్లా పూడుర్ మండలం భూవివాదంలో హైదరాబాదు మేయర్ గద్వాల విజయలక్ష్మి , తమ్ముడు వెంకటేశ్వర్ రావుల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. పూడుర్ మండలం మిర్జాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెం 20లో 10 ఎక‌రాల భూమిని దగ్గర ఉండి హైద‌రాబాద్ మేయ‌ర్ ఫెన్సింగ్ చేయిస్తున్నార‌ని స‌మాచారం. త‌మ భూమి ఫెన్సింగ్ తొల‌గించి గ‌న్ తో బెదిరించి క‌బ్జా చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. 2007లో ఈ భూమికి సంబంధించిన‌ వివాదంలోనే ప్రశాంత్ రెడ్డిని అనే వ్యక్తిని హత్య చేశామ‌ని.. మిమ్మల్ని కూడా చంపేస్తామంటూ మేయ‌ర్ బెదిరింపుల‌కు గురి చేస్తున్నార‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ బాధితులు మీడియాను ఆశ్ర‌యించారు. పోలిసుల స‌హ‌కారంతో భూమిని చదును చేసి మేయర్ విజయలక్ష్మి, తమ్మడు వెంకటేశ్వర రావులు ఫెన్సింగ్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article