జీహెచ్ఎంసి సిబ్బంది అక్రమ వసూళ్లు

హైదరాబాద్: హైదరాబాద్ అఫ్జల్ గంజ్ పరిధిలో వసూలు రాయళ్ళు రెచ్చిపోతున్నారు. జిహెచ్ఎంసి పేరుతో జాంబాగ్ పూల మార్కెట్ లో వసూలు దందా నడుస్తోంది. బల్దియా సిబ్బంది డబ్బులు తీసుకొని ఎలాంటి రసీదు లేకుండా వసూలు చేస్తున్నారు. వారంలో మూడు రోజులు వసూలు చేస్తున్నారు. 300 దుకాణాల్లో 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు వసూల్లు అవుతున్నాయి. చిరు పూల వ్యాపారుల పొట్ట కొడుతున్న వసూళ్ల రాయుళ్ల నుంచి తమను ఆదుకోవాలంటూ జాంబాగ్ పూల వ్యాపారులు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article