బాలికపై రాక్షస క్రీడ .. జననాంగాన్ని బ్లేడుతో కోసి రేప్ చేసి ..

Spread the love

GIRL RAPPED  AND CRUELLY  CUTS HER..

భాగ్యనగరం నడిబొడ్డున దారుణం జరిగింది .మహిళా దినోత్సవాన వెలుగులోకి వచ్చిన ఒక ఘటన అమ్మాయిల రక్షణను మరోసారి ప్రశ్నిస్తోంది. నిర్భయ ఉదంతాన్ని దేశం మర్చిపోకముందే, భాగ్య నగరం నడిబొడ్డున మరో ఘాతుకం జరిగింది. పదహారేళ్ల బాలికపై ఒక బాలుడు చేసిన పైశాచిక దాడి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఒళ్లంతా బ్లేడుతో గాట్లు పెట్టి, జననాంగం పైన సైతం కోసి చిత్రహింసలు పెడుతుంటే దయచేసి నన్ను వదిలేయ్ అంటూ ఆ బాలిక ఆర్తనాదాలు చేసింది. ఉన్మాదంతో రెచ్చిపోయిన సదరు బాలుడు చేసే వికృత చేష్టలను అక్కడే ఉండి చూస్తున్న మరికొందరు బాలురు వీడియో చిత్రీకరించి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.
బాలికను వివస్త్రను చేసి, ఇష్టమొచ్చినట్టు కొట్టి, ఒళ్లంతా బ్లేడుతో కోసి, జననాంగం ని సైతం గాయపరిచి మరి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక బాలుడు. అది చూస్తూ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందారు ఆ బాలుడి స్నేహితులు. ఫుల్ గా గంజాయి కొట్టి బాలిక ను నానా చిత్రహింసలకు గురి చేశారు. బాధతో బాలిక ఆర్తనాదాలు చేసినా పట్టించుకునే నాథుడు లేడు. అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో వీడియో చిత్రీకరిస్తూ బాలిక శరీర భాగాలను చూపాలంటూ వేధింపులకు గురిచేశారు.

లోయర్ ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్ ప్రాంతంలో చంద్ర నగర్ కాలనీ, లిబర్టీ, ఆయిల్ సీడ్స్ కాలనీకి చెందిన కొందరు బాలురు రోజు గంజాయి తాగుతూ ఉంటారు. వీరితో సన్నిహితంగా మెలిగిన ఒక బాలికను సైతం గంజాయి కి అలవాటు చేశారు సదరు బాలురు. గంజాయి మత్తులో ఈ నెల 2న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బాలుడు ఆమెపై అత్యాచారం చేయగా ఆ దృశ్యాలను స్నేహితులు చిత్రీకరించి, యు ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు అంతేకాకుండా ఆ వీడియోను మరికొందరు స్నేహితులకు షేర్ చేశారు.
ఇక ఈ విషయం తెలిసిన బాలిక వీడియో ను తొలగించాలని నిందితుడిని పదేపదే ప్రాధేయ పడుతూ వచ్చింది. వీడియో తొలగించాలంటే డీబీఆర్ మిల్స్ వద్ద తనను కలవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు సదరు బాలుడు. ఇంట్లో స్నేహితులను కలవడానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో బాలిక కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన గాంధీనగర్ పోలీసులు బాలికను గుర్తించి అసలు విషయం తెలుసుకున్నారు. బాలికపై జరిగిన లైంగిక దాడి, దారుణమైన సంఘటన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేశారు. నిందితులకు దేహశుద్ధి చేసి, అతని ఫోన్ లోని వీడియో లను డిలీట్ చేశారు స్థానికులు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *