స్కూల్ లో మద్యం తాగిన అమ్మాయిలు

Girls drink Alcohol in School .. షాక్ అయిన టీచర్లు

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులు పాఠశాలలోనే మందు కొట్టారు. తోటి విద్యార్థులను నోటికొచ్చినట్టు తిట్టారు. తాగిన మైకం ఎక్కువై స్కూల్లోనే పడిపోయారు. వైద్యులకు చూపించిన పాఠశాల సిబ్బంది మద్యం సేవించారని తెలిసి షాక్ అయ్యారు. దీంతో టీసీలు ఇచ్చి ఇంటికి పంపారు.
స్కూల్లోనే మద్యం సేవిస్తూ ఇద్దరు బాలికలు టీచర్ కు అడ్డంగా దొరికిపోయారు. విజయవాడలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో ఫిబ్రవరి 17 న జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు..శనివారం రోజు ఉదయం స్కూల్ బ్రేక్ లో మద్యం బాటిల్ తెచ్చుకుని తాగారు. అక్కడితో ఊరుకోకుంబడా పక్కనే ఉన్న తోటి స్టూడెంట్స్ పై ఇష్టమొచ్చినట్లుగా చెలరేగిపోయి బూతుల పురాణం అందుకున్నారు. తరువాత మైకం కమ్మి పడిపోయారు.
మద్యం తాగిన అమ్మాయిల తీరుతో తోటి విద్యార్ధులు హెడ్ మాస్టర్ కు కంప్లైంట్ చేశారు. వారి తీరుపై అనుమానించిన మాస్టారు డాక్టర్స్ ను పిలించటంతో అసలు విషయం బైటపడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా..వారి తల్లిదండ్రులను పిలిపించి టీసీలు ఇచ్చి ఇంటికి పంపారు. ఈ విషయంపై తోటి విద్యార్ధులను విచారించిన హెడ్మాష్టర్ మాట్లాడుతూ.. మద్యం తాగిన విద్యార్ధుల తండ్రులు వారి ఇంట్లో మద్యం తాగుతుంటారనీ..ఆ మిగిలినదాన్ని ఆ ఇద్దరు అమ్మాయిలు కూల్ డ్రింక్ లో కలుపుకుని స్కూల్ కు తెచ్చుకుని తాగుతున్నారనీ తెలిపారు. స్కూల్ పరువు పోతుందనీ ఆ ఇద్దరు విద్యార్ధినులకు టీసీలు ఇచ్చి పంపామని తెలిపారు.
తొమ్మిదో తరగతి విద్యార్థినులు స్కూల్ లో చేసిన ఈ చర్య తెలిసిన వారు షాక్ కు గురయ్యారు

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article