బరితెగించి బర్త్ డే పార్టీ చేసుకున్న బాలికలు  

girls having a birthday party

బీరు బాటిల్స్ తో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేలా స్కూల్ విద్యార్థులు  ప్రవర్తించారు అంటే పరిస్థితి ఎలా తయారవుతుందో అర్ధం చేసుకోవచ్చు.ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ మరిచి ఓ స్కూల్ స్టూడెంట్స్ అందునా అమ్మాయిలూ బీర్ బాటిల్స్ తో బర్త్ డే పార్టీ చేసుకుంటే , అది చూసిన టీచర్ మందలిస్తే సూసైడ్ చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తమిళనాడులోని సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1500 మంది అమ్మాయిలు చదువుతున్న ఈ స్కూల్‌లో మంగళవారం అబ్దుల్ కలాం జయంతి జరగ్గా.. ప్లస్ టూ చదువుతున్న ఓ అమ్మాయి బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో గుట్టు చప్పుడు చేయకుండా ఆమె తన క్లాస్ రూంలో స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు చేసుకుంది. వీరు కాస్త అత్యుత్సాహం చూపించి ఏకంగా బీరు బాటిల్స్‌తోనే పార్టీ చేసుకున్నారు. ఇంకేముంది వాటితో ఫోటోలు దిగుతూ సందడి చేశారు. కానీ ఇంతలోనే ఈ తతంగం మొత్తం స్కూల్ టీచర్ చూసింది.
అమ్మాయిలు మరీ ఇంతలా అతిగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేక గట్టిగా మందలించింది. ఇక ఆ గ్రూప్‌లో ఉన్న ఒక అమ్మాయి ఈ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వెళ్ళగానే సూసైడ్ చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా అంత్యక్రియలు పూర్తి చేశారట. ఇక ఈ విషయం ఎవరికీ చెప్పుకునే విషయం కాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు సైలెంట్ గా అంత్య క్రియలు జరిపారు.  ఆ విద్యార్థిని సూసైడ్ నేపధ్యంలో  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ బర్త్ డే బాష్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో పిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురి అవుతున్నారు. ఏదైనా కల్చర్ అంటే తాగటం కాదు . సెలబ్రేషన్ అంటే ఇలా ప్రవర్తించటం కాదు అని అందరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని కోరుకోవటం తప్ప ఇంకేం చెయ్యగలం .
tags : school girls, birthdayparty,  beer bottles, tamilnadu, idaipatti government school

కల్కి అవినీతి సామ్రాజ్యం 

తండ్రి మాట కోసం అసదుద్దీన్ ఓవైసీ ఏం చేశారో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *