12మేకల కాపరి దారుణ హత్య

తలను పట్టుకుపోయిన దుండగులు
ఏలూరు
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం మండలం జగ్గిసెట్టి గూడెం గ్రామంలో దారుణం జరిగింది. పొలం లో మేకల మందకు కాపలాగా పడుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేకల మంద కాపరి వనముల పర్వతాలు(60)ను దుండగులు హతమార్చారు. తలనరికి పట్టుకుపోయారు. దీంతో మంచపై తలలేని మొండెంను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article