లేడీ అమితాబ్ విజయశాంతి వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అయ్యింది. అలాగే సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్‌లో తానేంటో చూపిస్తుంది. తాజాగా `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` చిత్రంలో నటించి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు. వింటేజ్ విజయశాంతిని చూపించారు. విజయశాంతి లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` మూవీలో నటించింది. ఇందులో బలమైన పాత్రలో మెప్పించింది.
ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` మూవీలో మెరిసింది. మళ్లీ సినిమాలు కొనసాగిస్తారా? అంటే లేదనే చెప్పింది. తాను ప్రజలకు సంబంధించిన బాధ్యత గల పదవిలో ఉన్నానని, ఇక సినిమాలు చేయడం కుదరదు అని వెల్లడించింది.
ఇక ఇదిలా ఉంచితే… పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులను ఏం చేయబోతుంది? ఎవరికి ఇస్తుందనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.
అదే సమయంలో పిల్లల గురించి కూడా ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. తాను ప్రజల కోసమే పిల్లల్ని వద్దనుకున్నట్టు తెలిపారు విజయశాంతి. ఈ లైఫ్‌ని ప్రజలకు అంకితం ఇవ్వడం కోసమే పిల్లల్ని కనొద్దు అనుకున్నామని తెలిపారు.
ఈ సందర్భంగానే తన ఆస్తులకు సంబంధించిన షాకింగ్ విషయం వెల్లడించారు. తమ మరణ అనంతరం తన ఆస్తి మొత్తం ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు విజయశాంతి. తన తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్య, వైద్యం కోసం తన ఆస్తిని కేటాయిస్తానని చెప్పారు. తన వద్ద ఉన్న నగలన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేసినట్టు తెలిపారు. ఇలా విజయశాంతి నగలన్నీ ఆ శ్రీవారికి చెందాయన్నమాట. విజయశాంతి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి, అభిమానుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.