కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేకు గుడ్ న్యూస్

GOOD NEWS FOR REBEL MLAs

కర్ణాటకలో విప్ ధిక్కరించి బీజేపీకి అనుకూలంగా ఓటేసి అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వారిపై స్పీకర్ వేసిన అనర్హత వేటు సబబేనని పేర్కొన్నప్పటికీ, వారంతా డిసెంబర్ లో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చని స్పష్టంచేసింది. దీంతో వారంతా బీజేపీ టికెట్ పై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ సర్కారు ఏర్పాటు చేసి, కుమారస్వామి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీ రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తన వైపు లాగేయడంతో కుమారస్వామి సర్కారు మైనార్టీలో పడింది. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ వేటు వేశారు. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతను సమర్థించిన సర్వోన్నత నాయయస్థానం.. ఉప ఎన్నికల్లో వారు పోటీ చేయొచ్చని పేర్కొంది.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *