తెలుగురాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

Good News for Telugu States

నాగార్జున సాగర్ లో సీప్లేన్స్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభ వార్త చెప్పారు విమానయాన శాఖామంత్రి సురేష్ ప్రభు. ఇక తెలుగురాష్ట్రాల్లోనూ సముద్ర విమానాలు నాగార్జున సాగర్ లో కనువిందు చెయ్యనున్నాయి. పర్యాటకులకు అద్భుత అనుభూతిని కలిగించనున్నాయి. నీటిలో ల్యాండ్ అయ్యే సముద్రపు విమానాలు మనకు అందుబాటులోకి రానున్నాయి. నాగార్జునసాగర్ లో త్వరలో విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మొత్తం 18 రూట్లలో సీప్లేన్స్ 235 రూట్లలో ఉడాన్ కింద ఈ సేవలను అందించనున్నట్లు ఇందులో 16 అన్ సర్వ్డ్ ఎయిర్ పోర్టులు ఆరు వాటర్ ఏరోడ్రోమ్స్ ఉన్నాయని ఆయన వివరించారు.
నాగార్జునసాగర్ తో పాటు గౌహతి రివర్ ఫ్రంట్ అస్సాంలోని ఉమ్రాంగ్సో రిజర్వాయర్ గుజరాత్ లోని స్టాచూ ఆఫ్ యూనిటీ శత్రుంజయ్ డ్యామ్ సబర్మతీ రీవర్ ఫ్రంట్ లలో వాటర్ ఎయిరోడ్రమ్ ల ద్వారా ఉడాన్ విమాన సేవలు అందించనున్నారు. సీప్లేన్ ల ద్వారా మొత్తం లక్ష సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఉడాన్ స్కీమ్ కింద ఏటా 69.30 లక్షల సీట్లు అందుబాటులోకి వస్తాయని సురేశ్ ప్రభు వివరించారు. ఉడాన్ కింద గౌహతి నుంచి ఢాకా బ్యాంకాక్ లకు స్పైస్ జెట్ అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. ఉడాన్ మూడో రౌండ్ లో రాష్ట్రానికి చెందిన టర్బో మేఘా ఎయిర్ వేస్ తో పాటు 11 మంది ఆపరేటర్లకు రూట్లను కేటాయించారు.
స్పైస్ జెట్ ఇండిగో ఎయిర్ ఇండియా అనుబంధ కంపెనీ ఎయిర్ లైన్ అలైడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. 11 మంది ఆపరేటర్ల నుంచి వచ్చిన 73 ప్రతిపాదనలను విమానయాన శాఖ ఆమోదించింది. మొత్తం 89 ఎయిర్ పోర్టులు ఉడాన్ -3 కింద కనెక్టివిటీని పొందనున్నాయి. కొత్తగా కేటాయించిన 235 రూట్లలో 46 టూరిజం రూట్లు ఉన్నాయి. పర్యాటక ప్రదేశాలను అనుసంధానం చేసే ఈ రూట్లలో ఎలాంటి ఎయిర్ పోర్టు రాయితీలుండవు. మిగతా రూట్లలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద విమానయాన శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 1167 కోట్లను సమకూర్చనున్నాయి. ప్రస్తుతం మొత్తం 155 రూట్లలో ఉడాన్ విమాన సేవలు నడుస్తున్నాయి. మొదటి విడతగా 13 లక్షల సీట్లు రెండో విడతలో 29 లక్షల సీట్లను కేటాయించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article