ప్రయాణికులకు శుభ వార్త

Good news for Travelers … 22 రైళ్ళ సేవల పొడిగింపు

ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 22 రైళ్ల సేవలను పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులలో హర్షం వ్యక్తమవుతోంది
.దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా సంస్థ రైల్వే. కోట్లాది మంది ప్రజలు రైళ్లలోనే ప్రయాణిస్తారు. మధ్య తరగతి వారు ఎక్కువగా ఆశ్రయిస్తారు. కారణం చీప్ అండ్ బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కావడమే. దేశ రవాణా వ్యవస్థలో రైళ్లకు చాలా ప్రాధ్యానత ఉంది. తాజాగా రైల్వేశాఖ శుభవార్త వినిపించింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య నడిచే 22 రైళ్ల సేవలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
వీటిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన సికింద్రాబాద్-తాండూరు (67249/67250) మధ్య నడిచే మెమో రైలును చిత్తాపూరు వరకు పొడిగించారు. మిర్యాలగూడ-కాచిగూడ (77673/77674) మధ్య నడిచే డెమో రైలు నడికుడి వరకు పొడిగించారు. విశాఖపట్నం (58526/58525) నుంచి పలాస వరకు నడిచే రైలును బరంపుర వరకు పొడిగించగా.. హౌరా (20889/20890) నుంచి విజయవాడ వరకు ప్రయాణించే ‘హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలును తిరుపతి వరకు పొడిగించారు.
పొడిగించిన 22 రైళ్ల సేవల వివరాలను గమనిస్తే
హావ్‌డా-విజయవాడ హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20889/20890)ను తిరుపతి వరకు పొడిగించారు . ఇది ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. కటక్‌-బ్రహ్మపుర (68433/68434 మెమూ)ను ఇచ్చాపురం వరకు పొడిగింపు చేశారు. ఈ మార్గంలోని అన్ని స్టేషన్లలో ఇకపై ఈ రైలు ఆగుతుంది.ఇక సికింద్రాబాద్‌-తాండూరు (67249/67250 మెమూ) రైలును చిత్తాపుర్‌ వరకు పొడిగించారు. ఇది మన్‌తట్టి, నవంద్గి, కురుగుంట, సెరం, మల్‌ఖయిడ్‌రోడ్డు స్టేషన్లలో ఆగుతుంది. ఇంకా మిర్యాలగూడ-కాచిగూడ (77673/77674 డెమూ) రైలును నడికుడి వరకు నడుస్తుంది. ఇక నుంచి ఇది కొండ్రాపోలె హాల్ట్‌, విష్ణుపురం, పొందుగుల స్టేషన్లలో ఆగుతుంది.ఇక విశాఖపట్నం-పలాస (58526/58525) ప్యాసింజర్‌ బ్రహ్మపుర వరకు వెళ్తుంది. ఆ మార్గంలోని అన్ని స్టేషన్లలోనూ ఈ రైలు ఆగుతుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article