ఆరోగ్యశ్రీపై గుడ్ న్యూస్

GOOD NEWS IN AAROGYASRI

  • నెలకు రూ.40వేలు ఆదాయమున్న వర్తింపు
  • ఆర్థికమంత్రి బుగ్గన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మక ఆరోగ్యశ్రీ పథకంపై ఆ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే మాత్రమే వర్తిస్తున్న ఈ పథకాన్ని మరింత మందికి వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించింది. నెలకు రూ.40వేల లోపు ఆదాయం ఉన్నవారిని కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారని తెలిపారు. ప్రజల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణమైన అతి ముఖ్యమైన పథకాల్లో ఆరోగ్యశ్రీ ఒకటన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ పథకానికి జీవం పోశారని, బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి అధిక నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఏడాదికి రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. అంటే నెలకు రూ. 40వేల లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలందరూ ఈ పథకం కిందకు వస్తారని వివరించారు. దీంతో అదనంగా మరో 5 లక్షల మంది ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు పొందుతారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల్లో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆపై ఎంత పెద్ద మొత్తమైనా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన జగన్.. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 1,740 కోట్లు కేటాయించారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article