తొలి వికెట్ కోల్పోయిన కివీస్

GOOD STAR FOR KIWIS

  • భారత్ తో మొదటి టీ20లో టిమ్ హాఫ్ సెంచరీ

టీమిండియా, న్యూజిలాండ్ జట్ట మధ్య ప్రారంభమైన తొలి టీ20లో కివీస్ జట్టుకు చక్కటి ఆరంభం లభించింది. టెస్టు, వన్డే సిరీస్ లు కోల్పోయి నిరాశలో మునిగిపోయిన తమ జట్టుకు న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా రోహిత్ శర్మ.. ఆతిథ్య జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. తొలినుంచీ కివీస్ ఓపెనర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇరువరూ కలిసి తొలి వికెట్ కు 8 ఓవర్లలో 86 పరుగుల జోడించారు. ఈ దశలో పాండ్యా బౌలింగ్ లో మున్రో 34 (20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్ లు) ఔట్ అయ్యాడు. మరోవైపు టిమ్ ధాటిగా ఆడి అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఒక వికెట్ కోల్పోయి 114 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం క్రీజ్ లో టిమ్ 73 నాటౌట్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లు), విలియమ్సన్ 5 (7 బంతుల్లో) క్రీజ్ లో ఉన్నారు.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article