గోపీచంద్ సినిమా రీమేకా?

Gopichand Movie Remake
యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. దాదాపు యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ చేస్తారు. ఈ సినిమా బాలీవుడ్ మూవీ ఏక్‌థా టైగ‌ర్ సినిమాకు రీమేక్ వెర్ష‌న్ అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బాలీవుడ్ న‌టి జ‌రీనా ఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. వేసవి కానుకగా మే లో  సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article