గోపీచంద్ దశ తిరుగుతోందా..?

gopichand movie

యాంగ్రీ మేన్ గా తనకంటూ తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ గోపీచంద్. కానీ మధ్యలో అతని కెరీర్ గాడి తప్పింది. ఛేంజ్ ఓవర్ కోసమంటూ కామెడీ సినిమాలు చేసి ఉన్న ఇమేజ్ కు ఎసరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా ఓ భారీ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు గోపీచంద్. ప్రస్తుతం సంపత్ నందితో సీటీమార్ చేస్తోన్న ఈ గోలీమార్ స్టార్ కు లేటెస్ట్ గా రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. అయితే వీటిలో ఒకటి క్రేజీయొస్ట్ కాంబోగా రాబోతోంది. తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ కు తొలి సినిమా పరాజయంగా మిగిలింది. దీంతో నెక్ట్స్ స్టెప్ విషయంలో కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పుడు అతన్ని జయం మూవీతో విలన్ గా పరిచయం చేసి కొత్త కెరీర్ ని ఇచ్చాడు దర్శకుడు తేజ. జయం తర్వాత వర్షం, నిజం సినిమాలతో పవర్ ఫుల్ నటనతో విలన్ గా నిరూపించుకున్నాడు గోపీచంద్. ఇక ఆ తర్వాత మళ్లీ యజ్ఞం మూవీతో హీరోగా టర్న్ మాస్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఇమేజ్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ గోపీకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మధ్యలో లౌక్యం మూవీతో కామెడీ చేసి ఆ తర్వాత అదే రూట్ లో వెళ్లి ఇబ్బందులు తెచ్చుకున్నాడు. ఈ మధ్య అతను చేసిన సినిమాలన్నీ వరుసగా పోతున్నాయి. కెరీర్ లో 25వ సినిమాగా వచ్చిన పంతం సైతం మెప్పించలేదు. ఇక చాణక్య అయితే విపరీతమైన విమర్శల పాలైంది.

అంతకు ముందే తనెంతో నమ్మకం పెట్టుకున్న గౌతమ్ నందా సినిమా పోయినా .. ఆ దర్శకుడు సంపత్ నందిపై నమ్మకం ఉంచాడు గోపీ. వీరి కాంబోలో వస్తోన్న సినిమానే సీటీమార్. తమన్నా హీరోయిన్. ఈ ఇద్దరూ కబడ్డీ టీమ్ కోచ్ లు కనిపిస్తుండటం సీటీమార్ ప్రత్యేకతలు. ఇక తనను విలన్ గా పరిచయం చేసిన తేజ ఫస్ట్ టైమ్ గోపీచంద్ హీరోగా సినిమా చేస్తున్నాడు. వెంకటరమణ అలిమేలు మంగ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ అయిన ఈ మూవీలో గోపీ సరసన కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచాడు తేజ. కీర్తి సైతం ఈ సినిమా కథకు స్పెల్ బౌండ్ అయిందట. గోపీచంద్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కీర్తి వంటి క్రేజీ హీరోయిన్ సెట్ కావడం పెద్ద ప్లస్ అనే చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత ఈ మూవీ షూటింగ్ కు వెళుతుంది. ఒక రకంగా ఇది క్రేజీయొస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే దర్శకుడు మారుతి కూడా గోపీచంద్ కోసం ఓ మాస్ స్టోరీ రెడీ చేశాడట. ఈ తరహా కథ మారుతికి కూడా మొదటిసారే. ఈ కథ కూడా గోపీచంద్ కు నచ్చిందంటున్నారు. కుదిరితే ఈ ప్రాజెక్ట్ కూడా తేజ సినిమాతో పాటుగా ఒకేసారి సెట్స్ పైకి వెళ్లొచ్చు అంటున్నారు. మొత్తంగా గోపీచంద్ మూవీ లైనప్ చూస్తే మరోసారి దుమ్మురేపడం ఖాయం అనిపిస్తోంది కదూ.

tollywood news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article