కార్మికులతో ప్రభుత్వం చర్చలు చేస్తుందా..?

governament vs RTC workers

ఆర్టీసీ సమ్మె ఉగ్రరూపం దాల్చింది.  అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది. ఇక ఈనేపధ్యంలో మంత్రులతో సుదీర్ఘ చర్చ జరిపిన కేసీఆర్ పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తున్నారు. చర్చల ప్రసక్తే లేదని కేసీఆర్ ఖరాకండిగా చెప్పారు, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారక పొతే కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు కాదు, ఉద్యమం తప్పదు అని ప్రజలు భావిస్తున్నారు. ఒక పక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణాల్లో అన్ని విషయాల్లో దూసుకుపోతున్నారు.
సీఎం కేసీఆర్ కార్మికుల ను దృష్టిలో పెట్టుకొని తగు నిర్ణయం త్వరితంగా తీసుకోవాల్సి వుంది. హుజుర్ నగర్ ఉప ఎన్నిక దగ్గర పడటం, ఈ రోజే దానికి సంబంధించి సభలు నిర్వహించడం, ర్యాలీ లు చేయడం జరుగుతుంది. మరి కేసీఆర్ పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యం లో నిన్న రాత్రి తీసుకున్న నిర్ణయాలు ఏమిటని తెలియాల్సి వుంది. రవాణా శాఖా పువ్వాడ హాజరు కాగా, రాష్ట్రం లోని పరిస్థితుల పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడమే కాకుండా ఆర్టీసీ ఎండీ పోస్టుని సైతం తక్షణమే భర్తీ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బస్సులు వంద శాతం తిరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు.అయితే సమ్మె విరమిస్తేనే చర్చలు నిర్వహిస్తామని చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఆర్టీసీ కార్మికులు చర్చలు జరిగిన తర్వాతే సమ్మె విరమిస్తామని చెప్తున్నారు.

tags :tsrtc, tsrtc strike, rtc strike, telangana government, rtc workers, jac, talks, high court

తెలంగాణలో మద్యం దరఖాస్తుల వెల్లువతో కాసుల గలగల

బరితెగించి బర్త్ డే పార్టీ చేసుకున్న బాలికలు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *