ప్రజావేదిక ను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

Government Take over the Praja Vedhica

ప్రజావేదిక కోసం మాజీ సీఎం కోరికను తిరస్కరిస్తూ ప్రభుత్వం ప్రజావేదిక స్వాధీనానికి నిర్ణయం తీసుకుంది. నాకు కేటాయించాలన్న మాజీ సీఎం చంద్రబాబు లేఖకు.. ప్రభుత్వం చెప్పకనే సమాధానం చెప్పింది. ప్రభుత్వానిదే అని తేల్చేసింది. చంద్రబాబుకు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే.. ప్రజావేదిక నుంచి చంద్రబాబుకు సంబంధించిన సామానులను తరలించింది . బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉండవల్లిలో ప్రజా వేదిక నిర్మించారు.చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ఈ ప్రజావేదికను తమకు కేటాయించాలని అటు టీడీపీ..ఇటు వైసీపీ కోరాయి. దీనిపై ఇప్పటికే సీఎం జగన్‌కు బాబు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఉపయోగంగా.. ప్రజావేదికను ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో.. వైసీపీ నుంచి కూడా కొందరు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఏది ఏమైనా అది ప్రభుత్వ భవనం అంటున్నారు ఉన్నతాధికారులు.

జూన్ 21న ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జూన్ 22వ తేదీ చంద్రబాబుకి సంబంధించిన టేబుళ్లు, కుర్చీలు, ఇతరత్రా సామాగ్రీని తీసి బయటపెట్టారు. తరలింపుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా చేస్తున్నారంటూ ప్రజావేదిక దగ్గర అసహనం వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు. సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుబట్టారు. విదేశాల్లో ఉన్న చంద్రబాబుకు ఈ సమాచారం ఇచ్చి.. తదుపరి ఆందోళన చేపడతామని వెల్లడించారు నేతలు. ప్రజావేదిక కట్టడం అక్రమం అయితే కలెక్టర్ల సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందులోనే ఎలా సమీక్షలు నిర్వహిస్తోందని నిలదీశారు. కనీసం సమాచారం, సమయం ఇవ్వకుండా ఇలా ఎలా చేస్తారని నిలదీస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేయాలన్నంత కసి ఉందని.. ఏమీ చేయలేకపోతున్నామనే నిస్సాహాయతను వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article