కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల కట్టడి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్లో పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఇందులో ఆయన పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.

111
government will control school fees
government will control school fees

కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడి పైన తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారతదేశంలో ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక మద్దతు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించారన్నారు. తెలంగాణలో పూర్తిస్థాయి లాక్డౌన్ వచ్చే అవకాశం లేదన్నారు. నిజాంబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటు పైన… అది తీసుకొస్తానని బాండ్ పేపర్ పైన హామీ ఇచ్చిన వ్యక్తిని అడగాలన్నారు.

• చైనా లాంటి దేశంతో పోటీ పడాలంటే భారీ ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉందని.. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ టెక్స్ టైల్ పార్కు లేదా హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణ కొనసాగుతుందని కరోనా సంక్షోభం వలన ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యం అయింది అన్నారు. హైదరాబాదులో మరిన్ని ఇతర ప్రాంతాలకు ఐటిని తీసుకువెళ్లే అంశంలో చురుగ్గా పని చేస్తున్నామన్నారు. నిజామాబాద్ ఐటి హబ్ పనులు కొనసాగుతున్నాయి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఐటి హబ్ నిర్మాణం కొనసాగుతుందన్నారు. వికారాబాద్లోని అనంతగిరి ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా తయారు చేస్తామన్నారు.

  • నాగార్జునసాగర్ ఎన్నికల్లోలో ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గతానికి ప్రాతినిధ్యం వహించే జానారెడ్డి మరియు భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించే యువకుడు నోముల భగత్ మధ్యలో అని అన్నారు. వ్యక్తిగతంగా తన కూతురికి కొడుకుకి మనసు మాట వినాలని చెప్తా అని, ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వానని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here