అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళసై

త్రిబుల్ ఐటీ కి చేరుకున్న గవర్నర్

త్రిబుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు రోజుల క్రితం బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కు విన్నవించడంతో. బాసర పర్యటలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాదు నుండి రైల్లో బయలుదేరి బయలుదేరి ఆదివారం ఉదయం బాసరకు చేరుకున్నారు. మొదట అమ్మవారిని దర్శించుకు వెళ్లగా బాసర ఆలయ నిర్వాహకులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు చీరను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పని వాళ్ళు చేసుకుని ఇవ్వలని అంటూ పోలీసులను ఆదేశించారు. ఇక్కడి నుండి నేరుగా త్రిబుల్ ఐటీ కళాశాలకు వెళ్లారు అక్కడ ప్రధాన గేటు వద్ద బాసర త్రిబుల్ ఐటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ. డైరెక్టర్ సతీష్ కుమార్ లు ఆమెకు స్వాగతం పలికి కళాశాలలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కళాశాలలో కాలినడకన అన్ని ప్రదేశాలను సందర్శిస్తు విద్యార్థులతో నేరుగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article