తమిళిసై చొరవతో సమ్మె విరమించిన క్యాబ్ డ్రైవర్లు

81
Governor Visited Kaleshwaram Project
Governor Visited Kaleshwaram Project

governor tamilisai meeting with cab drivers

తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ సమ్మె ప్రకటన చేశారు.  ఇందులో భాగంగా శనివారం నుంచి తాము సమ్మె బాట పడతామంటూ వారు చెప్పారు . ఇలాంటి వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ల జేఏసీ నాయకులకు ఏకంగా గవర్నర్ అపాయింట్ మెంట్ లభించటం.. తమ సమస్యల్ని గవర్నర్ ముందుకు తీసుకెళ్లటం లాంటివి చోటు చేసుకున్నాయి.వారి వినతిపత్రం మీద స్పందించిన గవర్నర్ తమిళ సై తనకు మంగళవారం వరకూ సమయం ఇవ్వాలని.. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వ్యవహరించాలని కోరారు. గవర్నర్ స్పందించిన తీరుతో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ సమ్మె నుంచి పక్కకు తప్పుకునేందుకు సిద్దమయ్యారు.
తమ సమస్యలపై గవర్నర్ తమిళ సై ఇచ్చిన హామీ మేరకు తాము సమ్మెను విరమిస్తున్నట్లుగా పేర్కొన్న క్యాబ్ డ్రైవర్లు.. ఎప్పటిలానే తమ సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. గవర్నర్ కోరిన గడువు పూర్తి అయ్యే వరకూ వెయిట్ చేస్తామని.. ప్రభుత్వం ఆ లోపు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించని పక్షంలో తాము మళ్లీ సమ్మె బాట పడతామని ప్రకటించారు.గవర్నర్ తీరుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న క్యాబ్ డ్రైవర్ల జేఏసీ.. ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందన్న దానిపైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన చేతలతో సమ్మెను తాత్కాలికంగా విరమించేలా చేసిన గవర్నర్.. సీఎం కేసీఆర్ లో ఏం మిస్ అయ్యిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సీఎం ఇదే తీరులో స్పందించి ఉంటే.. విషయం ఇంతవరకూ వచ్చేది కాదన్నట్లుగా మారింది.అంతేకాదు.. క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరాన్ని గవర్నర్ తీసుకొచ్చారని చెప్పాలి. వినతిపత్రం తీసుకొని సమయాన్ని ఇవ్వాలని కోరి.. తానే గడువు చెప్పేసిన నేపథ్యంలో.. క్యాబ్ డ్రైవర్ల సమస్యల విషయంలో ప్రభుత్వం ఏ మేరకు రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
tags: cab drivers strike, governor, tamilisai , initiation ,  ts government , cm kcr

కూలిన హెరిటేజ్ భవనం

“మా” సమావేశం రసాభాస..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here