విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలు రద్దు…

govt cancel republic day celebrations in visakha

ఏపీలో రిపబ్లిక్ వేడుకలపై  ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది . విశాఖలో ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే రిపబ్లిక్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సారి విజయవాడలోని మునిసిపల్ గ్రౌండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో విశాఖలో రిపబ్లిక్ వేడుకల ఏర్పాట్లను అధికారులు రద్దుచేశారు. బీచ్ రోడ్డులో సన్నాహక పెరేడ్‌లో ఉన్న దళాలను వెనక్కి రావాలంటూ అధికారులు ఆదేశించారు.

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత జగన్ సర్కార్ ఊహించని విధంగా విశాఖపట్నానికి ఫస్ట్ షాక్ ఇచ్చింది. విశాఖలోనే  ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని తొలుత తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సారి విజయవాడలోనే ఈ వేడుకలను నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలోనే ఈ సారి గణతంత్ర దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశారు అక్కడి అధికారులు. రామకృష్ణా బీచ్ రోడ్డులో కొద్దిరోజులుగా రిహార్సల్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

govt cancel republic day celebrations in visakha,ap , ap government , republic day celebrations

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article