Govt Clarifies Hyderabad India Second Capital
ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో దేశానికి రెండో రాజధాని ప్రస్తావన వచ్చింది. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ను గురించి కేంద్రం ఆలోచిస్తుందని పలు ఊహాగానాలు ప్రచారమయ్యాయి. దేశానికి రెండో రాజధానిగా కావాల్సిన అన్ని సౌకర్యాలు హైదరాబాద్ కి ఉన్నాయని, కాబట్టి కేంద్రం దేశానికి రెండవ రాజధానిగా నూ, కేంద్ర పాలిత ప్రాంతం గానూ హైదరాబాదును చేస్తుందని గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఇక దీనిపై అలాంటిదేమీ లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. దక్షిణాదిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేస్తారనే ప్రచారం నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు కెవిపి రామచంద్ర రావు. దీంతో కేంద్ర మంత్రి దీనిపై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చి ఇక దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ అన్న అంశానికి ఫుల్ స్టాప్ పెట్టారు.