ప్రభుత్వానికి రూ. 2,750 కోట్ల నష్టం?

Govt Lost 2,750 CR Revenue

# వామ్మో.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2,750 కోట్ల నష్టమా?
# హఠాత్తుగా ఇంత నష్టం ఎలా జరిగిందనేది మీ సందేహమా?
# కర్టసీ.. యూడీఎస్ స్కీమ్, ప్రీ లాంచ్ సింగిల్ టైమ్ పేమెంట్..
# హైదరాబాద్లో కొంతకాలంగా వందకు పైగా బిల్డర్లు చేస్తున్న దందా ఇది..
# బిల్డర్లు తక్కువ రేటుకు అమ్ముతున్నారు.. బయ్యర్లు కొంటున్నారు..
# ఇందులో ప్రభుత్వానికి వాటిల్లే నష్టమేముంది? అని చాలామందికి సందేహం కలగొచ్చు..

తెలంగాణ రాష్ట్రంలో అపార్టుమెంట్లు నిర్మించే డెవలపర్లలో అధిక శాతం మంది స్థానిక సంస్థలు, రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకుంటారు. నిర్మాణం ఆరంభ దశ నుంచి పూర్తయ్యే దాకా వాటిని విక్రయిస్తారు. ఇది ఆనవాయితీగా వస్తున్నదే. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ దశలోనే దాదాపు ఫ్లాట్లన్నీ అమ్ముడవుతుంటాయి. ఈ క్రమంలో ఐదు శాతం జీఎస్టీ, ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని చెల్లిస్తారు. అంటే, డెవలపర్లు కట్టే ఫ్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వాలకు నేరుగా 11 శాతం రాబడి వస్తుందన్నమాట. ఉదాహరణకు కోటి రూపాయల ఫ్లాట్ బయ్యర్లు కొనగానే.. వాటి మీద జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.11 లక్షలు ఖజానాకు చేరుతుంది. యాభై లక్షల ఫ్లాటు అయితే రూ.5.5 లక్షల దాకా ఆదాయం ఖజానాలో పడుతుంది. ఇదంతా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అథారిటీల నుంచి అనుమతి తీసుకుని నిర్మిస్తేనే సాధ్యమవుతుంది. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు. డెవలపర్లు అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద స్థలాన్ని విక్రయించి, దాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. ఉదాహరణకు, ఇదెలా చేస్తున్నారంటే..

# ఎకరా స్థలం తీసుకుని.. ముందుగా స్థల యజమానికి కొంత అడ్వాన్సు చెల్లిస్తారు.
# భూయజమానికి మిగతా సొమ్ము కట్టేందుకు కొంత గడువు తీసుకుంటారు.
# ఈలోపు ఆయా ఎకరం స్థలాన్ని 48.4 గజాల చొప్పున కనీసం వందమందికి విక్రయిస్తారు.
# అలా విక్రయించాక యూడీఎస్ కింద డెవలపర్ 48.4 గజాల స్థలాన్ని బయ్యర్ కు రిజిస్టర్ చేస్తారు.
# ఫ్లాట్ కొన్నప్పుడు చేసే రిజిస్ట్రేషన్ ఇక్కడ జరగదు. కేవలం ఈ స్థలం రిజిస్టర్ చేస్తారంతే.
# ఆ తర్వాత వారి నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుని బిల్డర్ నిర్మాణ పనుల్ని ఆరంభిస్తారు.
# ఆ స్థలం మీద చట్టపరంగా ఎలాంటి వివాదాల్లేకుండా ఉంటే బయ్యర్లకు ఎలాంటి సమస్య ఉండదు.
# భూమిపై న్యాయపరమైన చిక్కులుంటే.. అనుమతి రాకపోతే కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి?
# కొన్నవారు నగదును కట్టడం వల్ల బిల్డర్ తో సమస్య ఏర్పడితే.. న్యాయపరంగా క్లెయిమ్ చేసుకోలేరు.
# బిల్డర్ తో పాటు అందులో కొన్నవారూ ఆయా ప్రాజెక్టులో సహ యజమానులు అవుతారు.
# బిల్డర్లు చేసే పొరపాట్లకు అందులో స్థలం కొన్నవారూ బాధ్యత వహించాలి.

# పశ్చిమ, తూర్పు హైదరాబాద్లలో ఇలాంటి అక్రమ తంతు కొంతకాలంగా సాగుతున్నది.
# కొందరు సుమారు రూ.25 వేల కోట్ల నగదును కొనుగోలుదారుల్నుంచి వసూలు చేశారు.
# డెవలపర్లు తెలివిగా సమాజంలో పలుకుబడి గలవారిని ఏజెంట్లుగా నియమిస్తున్నారు.
# వారికి అధిక కమిషన్లు ముట్టచెప్పి అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మి సొమ్ము లాగుతున్నారు.
# ఇక్కడ బిల్డర్, బయ్యర్ల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండట్లేదు.
# నొయిడా, గుర్గావ్ తరహాలో ఇక్కడా కొనుగోలుదారులు బిల్డర్ల చేతిలో మోసపోయే ప్రమాదముంది.

# దొంగతనాలు, దోపిడిలు చేసిన వారిని పట్టుకుంటే పోలీసులెంతో హడావిడి చేస్తారు. మరి, బయ్యర్ల నుంచి అక్రమ పద్ధతిలో సొమ్ము వసూలు చేసేవారిని ఎలా దారిలోకి తెస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే.. ప్రభుత్వం ముందే మేల్కొని ఈ అక్రమ తంతకు చరమగీతం పాడితే.. వందలాది అమాయక కొనుగోలుదారులు నష్టపోకుండా అరికట్టొచ్చు.

Hyderabad Real Estate Updates  

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article