వరుడిగా అన్న స్థానంలో తమ్ముడు

GROOM CHEATING BRIDE

  • పెళ్లి చేసుకోవడానికి వెళ్లిన ప్రబుద్ధుడు
  • స్వయంగా అన్నే పంపించిన వైనం

ఇప్పటివరకు ఒకరి బదులు మరొకరు పరీక్షకు వెళ్లిన సంఘటనలు చూశాం. కానీ ఇది కాస్త కొత్త విషయం. తన బదులు వరుడిగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని సొంత తమ్ముడికే సూచించాడో అన్న. సోదరుడి మాట మేరకు అతడు అందుకు సిద్ధమై వెళ్లిపోయాడు. అయితే, చివరి నిమిషంలో వధువు తరఫు బంధువులు గుర్తించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ విచిత్రమైన వ్యవహారం జార్ఖండ్ లో జరిగింది.

కిరిబురు పట్టణానికి చెందిన కరీమ్‌ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వధువును చూసుకున్నాడు. పెళ్లిక ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. శుక్రవారం ఊరేగింపుగా బయల్దేరాడు. అయితే భర్త ప్రవర్తనతో విసిగిపోయిన కరీం భార్యలు.. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్దే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఆగిపోతే వధువు తరఫు వారు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాల్సివస్తుందన్న కారణంగా తన స్థానంలో తమ్ముడిని పంపించాడు. మొదట వరుడిని కరీంగానే భావించిన వధువు బంధువులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్‌ అయ్యారు. పెళ్లి ఆపేయడంతో పాటు ఖర్చులు రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. దీంతో కరీం సోదరుడు ఆ మొత్తం చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు. కాగా, తనకు మూడో వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. తల్లి ఒత్తిడి మేరకే ఇలా చేశానని కరీం చెప్పడం కొసమెరుపు.

CRIME NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article