రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం సృష్టిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. దీంతోపాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను సైతం రద్దు చేసింది. OCT 16న 503 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 1:50 నిష్పత్తిలో 25,150 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు.