చిన్నవయసులోనే పెరుగుతున్న గుండె సమస్యలు

చిన్నవయసులోనే పెరుగుతున్న గుండె సమస్యలు
* యువకుడి ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు –

డా. చింతా రాజ్ కుమార్

* ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్ అమరిక

కర్నూలు, డిసెంబర్ , పెద్ద వయసులో ఉన్నవారికి గుండెపోటు రావడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు అతి చిన్నవయసు వారికీ గుండె సమస్యలు కనిపిస్తున్నాయి. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఎక్కువగా సిగరెట్లు కాల్చడం వల్ల రకరకాల సమస్యలతో చివరకు గుండెపోటుకు గురైన యువకుడి ప్రాణాలను కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కాపాడారు. ఈ కేసు వివరాలను కిమ్స్ హాస్పిటల్ కర్నూలుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ చింతా రాజ్ కుమార్ వెల్లడించారు.

‘‘కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 20 ఏళ్ల ఏసురత్నం డ్రైవర్ పని చేస్తున్నాడు. అతడు తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. ముందుగా ఈసీజీ, 2డీ ఎకో, అనంతరం యాంజియోగ్రామ్ లాంటి పరీక్షలు చేసిన తర్వాత.. అతడి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడినట్లు తేలింది. అత్యవసర పరిస్థితులలో స్టెంట్ వేయాల్సి రావడంతో ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా ఈ శస్త్రచికిత్స చేశాం. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశాం. ప్రస్తుతం అతడు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో గుండె పోటు రావడం చాలా అరుదు. కానీ ఈ రోగి తక్కువ వయసులోనే గుండెపోటు రావడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం సిగరెట్లు కాల్చడం. రోజుకు దాదాపు 20 సిగరెట్ల వరకు కాల్చేవాడు. దీంతో అతనికి చెడు కొలెస్టరాల్ రక్తంలో ఎక్కువగా ఉన్నదని తేలింది. భవిష్యత్తులోనూ ఈ రోగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం పూర్తిగా మానేయాలి, దాంతోపాటు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. వైద్యుల సలహాలను పాటించాలి’’ అని చెప్పారు.

ఈ సమస్య, దాని కారణాలు, ఇతర అంశాలను కూడా డాక్టర్ చింతా రాజ్ కుమార్ వివరించారు.

ఈ సమస్యను వైద్యపరిభాషలో మయోకార్డియల్ ఇన్ ఫార్క్షన్ (ఎంఐ) అంటారు. దీనిపై కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పరిశోధన చేశారు. 40 ఏళ్లలోపు వయసున్న 100 మంది ఎంఐ రోగులను పరీక్షించారు. భారతదేశంలో ఈ సమస్య ఉన్నవారిలో అత్యంత తక్కువ వయసున్నరోగి 19 ఏళ్లవారు. కర్నూలులో 20, 27 సంవత్సరాల వయసున్న రెండు కేసులు ఒకే నెలలో కిమ్స్ కర్నూలులో నమెదైనాయి. 40 ఏళ్లలోపు ఈ సమస్య వచ్చే అవకాశాలు 2% మాత్రమే.

• దక్షిణాసియాలో ఇతర దేశాలవారి కంటే భారతీయుల్లో తక్కువ వయసులోనే కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చేందుకు అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ.

• ధూమపానం, నెయ్యి వాడకం, పరగడుపున రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉండటం, అధిక కొలెస్టరాల్, రక్తపోటు, శారీరక వ్యాయామం బాగా తగ్గడం, తల్లిదండ్రుల్లో గానీ, తోబుట్లువులలో ఎవరికైన గుండెపోటు వచ్చినా కానీ ముందుగానే ఎంఐ సమస్య ఉండటం, లిపోప్రోటీన్-ఎ (ఎల్.పి.-ఎ), హైపర్ హోమోసిస్టెనీమియా, హైపర్ కాగ్యులబుల్ పరిస్థితి, కొకైన్ వాడకం లాంటివాటివల్ల ఈ సమస్యలు వస్తాయి.

• ధూమపానం (72%), హైపర్ కొలెస్టరాలేమియా (52%), కుటుంబంలో ఎవరికైనా హార్ట్ఎటాక్ చరిత్ర (35%) లాంటివి యువతలో ముప్పునకు ప్రధాన కారణాలు. ఇవి కాక ఇంకా మరికొన్నీ ఉన్నాయి..

ఇతర జనాభాతో పోలిస్తే భారతీయుల్లో గుండె పోటు వ్యాధి ప్రధాన లక్షణాలు.

• 2-4 రెట్లు అధిక ప్రాబల్యం

• మొదటి ఎంఐ ప్రారంభం కావడానికి 5-10 సంవత్సరాల ముందు

• యువతలో (45 ఏళ్లకంటే ముందు) 5-10 రెట్లు ఎక్కువగా ఎంఐ వ్యాధి, మరణాల రేటు

• సంప్రదాయ ప్రమాద కారకాల ప్రాబల్యం తక్కువ

• అభివృద్ధి చెందుతున్న ప్రమాద కారకాల ప్రాబల్యం ఎక్కువ

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article