వరుసరికార్డుల ఇస్రో

GSAT 31 success

దేశ కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రయోగం సక్సెస్ అయ్యింది. వినువీధిలో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం దిగ్విజయం అయ్యింది. ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి భారత కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్ 30 ని విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం 2019, ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు జీశాట్‌ -31 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఏరియానా రాకెట్‌‌ను 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది.
అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్‌ ప్రసార వ్యవస్థ ఉన్న జీశాట్‌ -31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్‌శాట్‌, జీశాట్‌లకు ఆధునిక రూపమని నిపుణులు చెబుతున్నారు. 15ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలందించే సామర్థ్యం కల్గిన ఈ ఉపగ్రహం బరువు 2వేల 535 కిలోలు. ఈ ఉపగ్రహం వీశాట్‌ నెట్‌వర్క్స్‌, టెలివిజన్‌ అప్‌లింక్స్‌, డిజిటల్‌ శాటిలైట్‌, డీటీహెచ్‌ టెలివిజన్‌, సెల్యులార్‌ బ్యాకప్‌లకు అనుకూలమైన సాంకేతికత సొంతం చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఇది అదనపు సేవలు అందిస్తుంది. భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు.

for more interesting news Tsnews.tv

Stay tuned to for more news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article