శంక‌ర్‌పై అంక్ష‌లు

Guide lines for Shankar

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌పై అంక్ష‌లు విధిస్తున్నారు నిర్మాత‌లు. ఇంత‌కు ఎవ‌రా నిర్మాత‌ల‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు `ఇండియ‌న్ 2` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల క్రితం రూపొందిన `ఇండియ‌న్‌`కు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ సినిమాకు ముందు ఇదే బ్యాన‌ర్‌లో రోబో సీక్వెల్ `2.0` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా ఈ సినిమా నిర్మాత‌ల‌కు వంద కోట్ల దాకా న‌ష్టాల‌ను మిగిల్చింది. దీంతో నిర్మాత‌లు ఈసారి అలా కాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని ముందుగానే శంక‌ర్‌తో అగ్రిమెంట్ చేయించుకున్నార‌ట‌. 250 కోట్ల రూపాయ‌ల్లోనే సినిమాను పూర్తి చేయాల‌ని కండీష‌న్ పెట్టార‌ట‌. శంక‌ర్‌కు వేరే దారి లేక స‌రేన‌న్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

Check out here For More News

For More Interesting and offers

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article