గులాబీ బాస్ నిర్ణయం ఎందుకిలా

Gulabi Boss Decision why like this? మంత్రి వర్గంలో హరీష్ కు స్థానం లేదా ?

క్యాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో కెసిఆర్ కుటుంబం లో ఏం జరుగుతుంది? మంత్రివర్గంలో హరీష్ రావు కు చోటు లేదు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత? ఒకవేళ అదే జరిగితే పార్టీలో ప్రచ్చన్న యుద్ధం తప్పదా? ఒకవేళ అదే జరిగితే కెసిఆర్ పరిస్థితి ఏంటి? అడకత్తెరలో పోకచెక్కలా అటు కొడుకు, ఇటు అల్లుడు మధ్య కెసిఆర్ నలిగిపోతున్నాడా ? ఇవి తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ సందర్భంగా అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నలు.

టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు తన్నీరు హరీశ్‌రావు. పార్టీ పట్ల, కేసీఆర్‌ నియంతృత్వ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురైన ప్రతిసారీ తనదైన వ్యక్తిత్వ ప్రదర్శనతో తెలంగాణ ప్రజల్లో గులాబీ గూడు కట్టుకునేలా చేసిన ఘనత కచ్చితంగా హరీశ్‌రావుదే. ఆయనో అజాత శత్రువు. ఇతర పార్టీలు సైతం హరీశ్‌రావును రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా విమర్శలు చేసేందుకు సిద్ధపడవు. అది ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. టీఆర్‌ఎస్‌ పార్టీని,తెలంగాణ ఉద్యమాన్ని జనంలో నిత్యం నానేలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయంగా తోడు-నీడగా నిలిచిన హరీశ్‌రావుకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోతోందనేది తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. హరీశ్‌రావును ఫేడవుట్‌ చేయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతున్నదని ప్రచారం జరుగుతోంది.

ఇక దానికి ఊతమిస్తూ కెసిఆర్ రేపు చేయనున్న మంత్రి వర్గ విస్తరణలో హరీష్ రావు కు స్థానం లేదని తెలుస్తోంది. కేసీఆర్‌ తానుండగానే కొడుకు కేటీఆర్‌కు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చక్కదిద్దే ప్రయత్నంలోనే ఈ కార్యచరణకు దిగినట్లు హరీశ్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో వూహించని అసమ్మతి కెసిఆర్ కు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ కెసిఆర్ స్వపక్షంలోని హరీష్ కు మద్దతుగా ప్రతిపక్షం తయారయితే దాన్ని కేసీఆర్ తట్టుకోగలడా. అలాంటి పరిస్థితి వస్తే కెసిఆర్ ఏం చేస్తాడు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతుంది.
హరీశ్‌రావు ప్రాధాన్యత తగ్గించేందుకు ఆయన్ను కొన్ని ప్రాంతాలకే లేదా కొన్ని వర్గాలకే పరిమితం చేస్తూ వచ్చినా హరీష్ మాత్రం ఇప్పటి వరకు చలించలేదు. గుమ్భానంగానే ఉన్నారు. పార్టీ కోసమే పని చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి హరీశ్‌ ఇస్తున్న ప్రాధాన్యంలో ఆయన అభిమానులెవరూ సంతృప్తిగా లేరన్నది వాస్తవం. ఈ అంశంపై హరీశ్‌రావులో ఎలాంటి వ్యతిరేకత లేకున్నా తెలంగాణలో, టీఆర్‌ఎస్‌లో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడాన్ని హరీశ్‌ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కేసీఆర్‌ ఇప్పటికే పార్టీని కేటీఆర్‌కు అప్పగించగా ఆయన తన వర్గాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు.
హరీశ్‌రావుకు పార్టీ పరంగా ఎలాంటి పదవులు లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వంలోనూ స్థానమివ్వకూడదని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌ పేరు లేదని లీకులు ఇచ్చి వ్యతిరేకత వస్తుందా రాదా అని కేసీఆర్‌ అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

ఒకవేళ కేసీఆర్ నిర్ణయంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తే కెసిఆర్ దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశముంది. అలా కాకుంటే తనయుడు కోసం కేసీఆర్ తన వ్యూహాన్ని అమలు చేసే ప్రమాదముంది. అదే జరిగితే హరీష్ రావ్ ఏం నిర్ణయం తీసుకుంటాడు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article