గుంటూర్ కుర్రాడికి సితార బంపర్ ఆఫర్

gurntu talkis

టాలెంట్ ఉంటే గుర్తింపు రావడానికి టైమ్ పట్టొచ్చు. గుర్తింపు రాలేదు కదాని ప్రయత్నం ఆపితే ఉపయోగం ఉండదు. ప్యాషన్ కు తోడు హార్డ్ వర్కింగ్ నేచర్ కూడా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో ఏదో రకంగా రాణిస్తారు. అలాంటి పట్టుదలతోనే మెల్లగా తన రేంజ్ మార్చుకుంటున్నాడు గుంటూర్ టాకీస్ కుర్రాడు సిద్ధూ. రీసెంట్ గా కృష్ణ అండ్ హిజ్ లీల అంటూ ఆకట్టుకున్న సిద్ధూ లేటెస్ట్ గా సితార బ్యానర్ లో బంపర్ ఆఫర్ పట్టేశాడు. హీరో కావాలన్న తపన చాలామందిలో ఉంటుంది. అందరూ ప్రయత్నిస్తారు. కానీ కొందరికే అదృష్టం ఉంటుంది. యస్.. ఇక్కడ టాలెంట్ కంటే లక్ దే పెద్ద మేటర్. అది ఉంటేనే క్లిక్ అవుతారు. అలా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన గుంటూర్ టాకీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. సినిమా మంచి విజయమే సాధించినా అతనికి సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రంలోనూ కనిపించాడు. ఇదీ ప్లస్ కాలేదు. నటుడుగా నిరూపించుకోవాలంటే ఏ ప్లాట్ ఫామ్ అయినా ఉపయోపడుతుంది. అందుకే తనూ భాగం అయి రవికాంత్ పేరేపుతో కలిసి కథ రాసుకున్నాడు.

రవికాంత్ డైరెక్షన్ లో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలతో సిద్ధూకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఓటిటిలో మూవీస్ లో ఎక్కువ ఆకట్టుకుంది కూడా ఈ చిత్రమే కావడం విశేషం. సిద్ధూకి లేటెస్ట్ గా బంపర్ ఆఫర్ తగిలింది. ఇలాంటి యంగ్ స్టర్స్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వారి రేంజ్ ను మార్చడంలో కీలకంగా ఉంటోన్న నిర్మాణ సంస్థ సితార బ్యానర్ లో ఆఫర్ పట్టేశాడు. ఈ సారి కూడా తను కథలో భాగం అయ్యాడు. ఓ కొత్త దర్శకుడితో కలిసి ఈ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. కృష్ణ అండ్ హిజ్ లీలలో తనతో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ నే మళ్లీ హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ బ్యూటీ ఇదే బ్యానర్ లో వచ్చిన జెర్సీలోనూ ఆకట్టుకుంది. ఈ సినిమాకు ‘నరుడి బ్రతుకు నటన’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టేశారు.  ఈ మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఈవెనింగ్ రాబోతున్నాయి. ఏదేమైనా సిద్ధూకి ఈ మూవీ పెద్ద ప్లస్ అవుతుందనే చెప్పాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *