Gurukula Patasala 49 Thousand for 280 seats notifications
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా తెలంగాణలోని మొత్తం 49,280 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ, విద్యాశాఖ పరిధిలోని మొత్తం 497 గురుకుల పాఠశాలలు ఉండగా, కొత్తగా 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 అందుబాటులోకి రానున్నాయి. ఈ పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం నాలుగు సొసైటీల పరిధిలో 616 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి. ఐదో తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.
పాఠశాలలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు మీ–సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు అవకాశం ఉంది. ముందుగా ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఫీజును ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతంలో రూ.50 ఉండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.100కు పెంచారు. దరఖాస్తు చేసే ముందు విద్యార్థి ఆధార్ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాలి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతిలో ప్రవేశానికి మాత్రమే నోటిఫికేషన్ వెల్లడయ్యింది. మైనార్టీ గురుకుల పాఠశాలలకోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే గురుకులాల సొసైటీ పరిధిలోని 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు సైతం ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.
గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1800–425–45678 లేదా http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http://tgtwgurukulam. telangana.gov.in, http://mjptb cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్‌లను సంప్రదించాలని సెట్ చీఫ్ కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
For More Click Here