బలం కావాలి.. అందుకే చేర్చుకున్నాం

GVL ABOUT TDP MPs

  • టీడీపీ ఎంపీల చేరికపై జీవీఎల్ వెల్లడి
  • ఏపీలో ప్రధాన శక్తిగా ఎదుగుతామని వ్యాఖ్య

రాజ్యసభలో తమకు తగినంత సంఖ్యా బలం లేదని, అందువల్లే తెలుగుదేశం పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్చుకున్నామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజ్యసభలో తమకు బలం అవసరమని, అందుకే వారిని పార్టీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గతంలో తాను టీడీపీ ఎంపీలను విమర్శించిన మాట వాస్తవమేనన్నారు. అయితే, దేశాభివృద్ధి కోసమే వారు బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారని వెల్లడించారు. వారిపై వచ్చిన అభియోగాలకు వారే వివరణ ఇస్తారన్నారు. తమ పార్టీలో చేరినవాళ్లు మంచివాళ్లని తాను సర్టిఫికేట్‌ ఇవ్వలేదని జీవీఎల్ స్పష్టంచేశారు. భియోగాలు ఉన్నవారికి తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. ఇక ఏపీలో తాము 2024 నాటికి ప్రధాన శక్తిగా ఎదుగుతామని ఆయన జోస్యం చెప్పారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article