H-1B VISA PROCESS STARTS AGAIN
- రేపటి నుంచి హెచ్-1బీ వీసాల ప్రాసెస్ షురూ
అమెరికా వెళ్లాలనుకున్న భారత టెకీలకు ఇది శుభవార్త. గత కొంతకాలంగా నిలిపివేసిన హెచ్-1బీ వీసాల ప్రాసెస్ మళ్లీ ప్రారంభించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ మళ్లీ మొదలుకానుంది. అన్నికోటాల్లోనూ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ జనవరి 28 నుంచి ప్రారంభించనున్నట్లు అమెరికా వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ దాఖలైన అన్ని ‘హెచ్-1బి క్యాప్’ పిటిషన్లను పరిశీలించనున్నట్లు పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే ఇది వర్తిస్తుందని, కొత్తవాటిని స్వీకరించట్లేదని స్పష్టం చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ కింద పిటిషన్‌దారులు అదనంగా రుసుము చెల్లించి తమ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను 15 రోజుల్లోపే పూర్తిచేసుకోవచ్చని వివరించింది.
పెండింగ్ లో ఉన్న వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు గతంలో అమెరికా H-1B వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను నిలిపేసింది. ఓవైపు అమెరికాలో తలెత్తిన సంక్షోభంతో ఈ ప్రక్రియ మరింతకాలం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అమెరికా సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే, కొన్ని విభాగాల్లో ఈ నిలిపివేత ఇంకా కొనసాగుతోంది.