గవర్నర్ ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు

91
Hajipur Affected Families Meeting With Governor
Hajipur Affected Families Meeting With Governor

Hajipur Affected Families Meeting With Governor

హాజీపూర్‌ వరుస హత్యల నిందితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘం నేతలు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో శ్రీనివాస్ రెడ్డి బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వచ్చిన శిక్ష పడలేదని, ప్రస్తుతం కోర్టులో విచారణ పూర్తికావస్తున్న నేపథ్యంలో అతనికి మరణ దండన విధించాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు .యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేశాడు శ్రీనివాస్ రెడ్డి. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి జిల్లాకో ఘటనలు జరుగుతున్నాయి. గవర్నర్‌ కూడా తన లిస్ట్‌లో హాజీపూర్‌ సమస్య ఉందని, తనకు మొత్తం తెలుసన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని సానుకూలంగా స్పందించార’ని పేర్కొన్నారు. బాధితురాళ్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను ఎలా చంపారో శ్రీనివాస్‌ను కూడా అదే విధంగా చంపాలని గవర్నర్‌ కోరామని తెలిపారు.

tags : Hajipur, Srinivas Reddy, Case Hearings, Death Punishment, Governor, Tamilisai, Encounter, Disha Accused

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here